ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Chandrababu_Visit_to_Flood_Affected_Areas

ETV Bharat / videos

మిగ్​జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు - ఏపీ లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 10:46 AM IST

TDP Chandrababu Visit to Flood Affected Areas: మిగ్​జాం తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ప్రధాన రహదారులను సైతం ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. తుపాను ప్రభావంతో ఈదురుగాలులతో కురిసిన వర్షంతో వేల ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పులు చేసి మరీ పంటకు పెట్టుబడులు పెడితే పంట చేతికందాల్సిన సమయంలో తుపాను ప్రభావంతో వర్షార్పణమైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

Crops Damaged with Michaung Cyclone Effect: ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్రవారం నుంచి పర్యటించనున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడనున్నారు. ఈ రోజు రాత్రికి బాపట్లలోనే బస చేయనున్న చంద్రబాబు శనివారం పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మిగ్​జాం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. నష్టపోయిన రైతులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details