ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో అత్యాచారాలపై టీడీపీ భూలక్ష్మి

ETV Bharat / videos

Telugu Women Fire on YCP: వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరవు.. తెలుగు మహిళల ఆందోళన

By

Published : Jun 21, 2023, 7:39 PM IST

TDP BHULAKSHMI ON RAPES IN YCP GOVT: వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువవుతోందని తెలుగు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వడ్డిపాలెం గ్రామంలో వివాహితపై అత్యాచారం జరగడంతో అవమానంగా భావించిన ఆమె.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పరిస్థితి గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను నెల్లూరులోని హాస్పిటల్​కు తరలించారు. ఆస్పత్రి​లో చికిత్స పొందుతున్న బాధితురాలిని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి కలిసి ధైర్యం చెప్పారు. గత నాలుగేళ్లలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఈ సందర్భంగా మీడియాతో ఆమె వాపోయారు. గత వారం రోజుల వ్యవధిలో నెల్లూరులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం, కావలిలో మరో మహిళపై దాడికి జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతినిత్యం మహిళలపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మద్యం, మాదకద్రవ్యాలకు నిలయంగా రాష్ట్రాన్ని మార్చడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. మహిళలకు తగిన రక్షణ కల్పించకుంటే, రానున్న ఎన్నికల్లో వారే తగిన గుణపాఠం చెప్తారని భూలక్ష్మి హెచ్చరించారు.  

ABOUT THE AUTHOR

...view details