ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రి ఆదిమూలపు సురేష్

ETV Bharat / videos

TDP: దళితులపై కాల్పులకు సీఎం జగన్ కుట్ర.. ఇదిగో సాక్ష్యం: టీడీపీ - ఐ ప్యాక్ కుట్ర

By

Published : Apr 23, 2023, 6:48 PM IST

Telugug desam party : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెం పర్యటనలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం.. తద్వారా కాల్పులకు దారి తీసే పరిస్థితి సృష్టించడానికి కుట్ర జరిగిందని టీడీపీ ఆరోపించింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు.. మూడు రోజులు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రగొండ పాలెం వద్ద దళితులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పడం వెనుక కుట్ర ఉందన్నారు.  

రెండు  రోజుల క్రితం ఎర్రగొండపాలెంలో  చంద్రబాబు  పర్యటనను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకుని రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు గాయపడగా.. చంద్రబాబుకు రక్షణగా ఉన్న ఎన్ఎస్‌జీ కమాండో సంతోష్ కుమార్​కు సైతం గాయాలయ్యాయి. అయితే, గాలి, వర్షం కారణంగా ముందుగా ఎంపిక చేసిన స్థలంలో సభ నిర్వహణ వీలు పడలేదని టీడీపీ వర్గాలు  చెబుతున్నాయి. ఈ కారణంగానే రోడ్డుపైనే  కార్యక్రమాన్ని  నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.  

చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనలో దళితులపై కాల్పులు జరిగేలా జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్ ద్వారా కుట్ర పన్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. అందుకు సంబంధించిన ఆధారాలంటూ పలు వీడియోలు విడుదల చేసింది. సంఘటలో మంత్రి ఆదిమూలపు సురేష్ పక్కన నల్ల టీషర్ట్ వేసుకుని కళ్లజోడు పెట్టుకున్న వ్యక్తి ఐ ప్యాక్ సభ్యుడని తెలుగు దేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆ సభ్యుడు మంత్రి వెంటే ఉండి.. చంద్రబాబుపై దాడికి సలహాలిస్తున్న తీరుతో పాటు పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్న తీరును ప్రజలు గ్రహించాలని కోరింది. 

ABOUT THE AUTHOR

...view details