ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Activist_Shiva_Parvati_Remand_Refused_in_Guntur

ETV Bharat / videos

TDP Activist Shiva Parvati Remand Refused in Guntur: వైసీపీకి వ్యతిరేకంగా పోస్ట్ చేసినందుకు శివపార్వతి అరెస్టు.. రిమాండ్ తిరస్కరించిన కోర్టు - posting against YsrCP in social media

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 9:29 PM IST

TDP Activist Shiva Parvati Remand Refused in Guntur :గుంటూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ మహిళ కార్యకర్త పిడికిటి శివ పార్వతి రిమాండ్​ను న్యాయమూర్తి తిరస్కరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని (Posting Against YSRCP in Social Media)  ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం 8 గంటల సమయంలో శివ పార్వతిని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరు పరిచే క్రమంలో వైద్య పరీక్షలు చేయించారు. జీజీహెచ్​లో పరీక్షల అనంతరం జిల్లా కోర్టు న్యాయమూర్తి ముందు హజరు పరిచారు. రిమాండ్ విధించేందుకు జడ్జి అంగీకరించ లేదు. ముందు 41 ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ.. ఇతరులకు ఎందుకు లేదని శివ పార్వతి ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ నేతలు విచక్షణ రహితంగా, ఇష్టానుసారంగా పోస్టులు పెడితేచర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీస్తే.. పోలీసుల దగ్గర సమాధానం లేదని ఆమె ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details