TDP Activist Death Due to Heart Attack : చంద్రబాబు విడదల కాలేదని.. గుండెపోటుతో ఓ కార్యకర్త మృతి - టీడీపీ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 6:43 PM IST
TDP Activist Death Due to Heart Attack in Sri Sathya Sai : శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు అరెస్టు చేశారన్న మనోవేదనతో ఓ కార్యకర్త గుండె ఆగింది. జిల్లాలోని తలుపుల మండలం ఎగువపేటకు చెందిన మహేశ్వర్ పార్టీలో చురుకైన కార్యకర్త, చంద్రబాబు నాయుడుకు వీరాభిమాని. మహేశ్వర్ ఆకస్మిక మృతికి కదిరిలో నిర్వహిస్తున్న రిలే దీక్ష శిబిరంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.
చంద్రబాబు అరెస్టై వారం అవుతున్నా.. ఇంకా జైలు నుంచి బయటకు రాకపోవటం వల్ల మహేశ్వర్ గురువారం అస్వస్థతకు గురయ్యారు. గమనించిన మిత్రులు హుటాహుటిన కదిరిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లు తెలిపారు. ఎగువపేట బూత్ కన్వీనర్ గా ఉన్న మహేశ్వర్ మృతి విషయాన్ని తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. మహేశ్వర్ మృతి పార్టీకి తీరని లోటు అని నాయకుల అన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.