ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Activist Brutally Murdered in YSR District

ETV Bharat / videos

TDP Activist Brutally Murdered in YSR District సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి.. - తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 5:01 PM IST

TDP Activist Brutally Murdered in YSR District: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఎంతో కాలంగా టీడీపీ తరఫున పనిచేస్తున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపారు. గతంలో కూడా పలుమార్లు బెదిరించారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పార్టీ మారమని ఒత్తిడి చేశారని తెలిపారు. లింగాల మండలం అంబకపల్లెకు చెందిన నాగరాజు.. పొలంలో పనులు చేసుకుంటుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికారు. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీడీపీ తరఫున పని చేస్తుండటం వల్లే చంపేశారని.. నాగరాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇటీవల పులివెందులకు చంద్రబాబు వచ్చినప్పుడు టపాసులు కాల్చడంతో వైసీపీ నాయకులు దాడి చేశారని వాపోయారు. హత్య జరిగిన స్థలాన్ని సందర్శించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి.. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాగరాజు హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details