వైఎస్సార్సీపీకి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా - మైనింగ్ పనులు నిలిపేయాలని ఆదేశాలు - అనంతపురంలో మైనింగ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 2:20 PM IST
Tax Department Inspection in MLA Kapu Ramachandra Reddy Quarry :అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు క్వారీల్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఇతర క్రషర్లకు ముడి సరుకు సరఫరా నిలిపివేయాలని, మైనింగ్ పనులు వెంటనే నిలిపేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సంబంధీకులకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాయంత్రం నుంచి క్వారీలో ముడి సరుకు రవాణా చేస్తున్న లారీలు ఆగిపోయాయి.
వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు - తనిఖీలు ప్రారంభించారు : ఎమ్మెల్యే టికెట్ ఆశించి రాకపోవడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కాపు రామచంద్రారెడ్డి తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశంలో విరుచుకుపడ్డాడు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో వైఎస్సార్సీపీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి రాయదుర్గం వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా ఏపీఐఐసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ హై కమాండ్ మేరకు అనంతపురం జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బొమ్మనహల్ మండలంలోని నేమకల్లు వద్ద ఉన్న కాపు రామచంద్రారెడ్డి క్వారీలలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో ఉన్నంతవరకు రామచంద్రారెడ్డిని ఏమీ చేయని జగన్ సర్కార్ పార్టీకి రాజీనామా చేయగానే అక్రమాలు వెలికితీసే పనిలో పడినట్లు తెలుస్తోంది.