ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Taneti_Vanitha_Comments_on_Chandrababu_Security

ETV Bharat / videos

Taneti Vanitha Comments on Chandrababu Security: రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు భద్రతలో లోపాలు లేవు: హోం మంత్రి - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 1:23 PM IST

Taneti Vanitha Comments on Chandrababu Security :మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో(AP Skill Development Case) అరెస్టై  రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ నేతలు అన్నారు. ఈ తరుణంలో హోం మంత్రి తానేటి వనిత మరోసారి స్పందిస్తూ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు భద్రత (CBN Security in Rajamahendravaram Central Jail) పరంగా ఎలాంటి లోపాలు లేవని... అన్నారు. ఆయనకు మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయని.. ఆయన సూచించిన వారినే లోపలికి అనుమతిస్తున్నామని హోం మంత్రి అన్నారు. చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణల్ని తానేటి వనిత ఖండించారు.

Taneti Vanitha Participate in Passing Out Parade of Police Dogs :గుంటూరు జిల్లా మంగళగిరి ఆరో బెటాలియన్‌లో నిర్వహించిన పోలీసు జాగిలాల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో తానేటి వనిత పాల్గొన్నారు. శిక్షణ పొందిన జాగిలాల నుంచి గౌవర వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన జాగిలాలకు హోం మంత్రి వనిత... పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం జాగిలాలు నిర్వహించిన విన్యాసాలు అందరీని ఆకట్టుకున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details