"నేనో గ్లామర్ బండి.. వచ్చేశా స్వర్గం నుండి".. అభిమానులను ముద్దులతో మత్తెక్కించిన తమన్నా - tamanna latest information
Tamannaah Bhatia Came to Vizianagaram: మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ పేరు వింటేనే,కుర్రకారు మదిలో ఓ గ్లామర్ బండి సవ్వడి .. అలజడి రేపుతుంది. అలాంటి అభిమాన నటి తమ ప్రాంతానికి వస్తుందంటే కొంటె కుర్రాళ్ల కాళ్లకు చక్రాలు వచ్చేస్తాయి. పరుగుపరుగున తమ అభిమాన నటి చెంతకు వచ్చేస్తారు. అలా..! విజయనగరంలో ఓ బంగారు వజ్రాల కొత్త షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ నటి తమన్నా భాటియాకు.. అభిమానులు భారీ నిరాజనాలు పలికారు. అభిమానుల జోష్‌కు ముగ్దురాలైన తమన్నా.. ప్లైయింగ్ కిస్సులతో సందడి చేసింది. సాంప్రదాయ దుస్తులతో విచ్చేసిన తమన్నాను చూసేందుకు.. కేవలం కుర్రకారు మాత్రమే కాదండోయ్.. ఆరేళ్ల బాబు నుంచి, అరువై ఏళ్ల తాత వరకు వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా ఈలలు, కేరింతలతో మార్మోగింది. భారీగా తరలివచ్చిన అభిమానులను.. తమన్నా ఆప్యాయంగా పలకరించింది. విజయనగరం ప్రజలంతా చాలా క్యూట్‌గా ఉన్నారని.. ఇక్కడకు మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెప్పింది. అక్కడకి వచ్చిన అభిమానులుకు.. ముద్దులు ఇస్తూ.. వాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది. దీంతో అభిమానులు.. ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మనసులోని మాటలను.. తమన్నా అభిమానులతో పంచుకుంది. మహిళలు.. తమ మనసుకు నచ్చిన పని చేయాలని.. మనసు మాట వినండని.. మనసు చెప్పినంటు వింటే ఎప్పుడూ మంచే జరుగుతుందని చెప్పింది. అదే విధంగా పురుషులు.. మహిళలను గౌరవించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.