ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tallavajjula Patanjali Sastri Honoured With Kendra Sahitya Akademi Award

ETV Bharat / videos

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంపై పతంజలి శాస్త్రి ఏమన్నారంటే!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 12:26 PM IST

Tallavajjula Patanjali Sastri Honoured With Kendra Sahitya Akademi Award:రాజమహేంద్రవరానికి చెందిన కథా రచయిత తల్లావజ్ఘల పతంజలి శాస్త్రి  రచించిన రామేశ్వరం కాకులు కథా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ 24 భాషల్లోని ఉత్తమ గ్రంథాలకు ఈ అవార్డులను ప్రకటించింది. తెలుగులో తల్లావజ్ఝల పతంజలి శాస్త్రికి ఈ పురస్కారం దక్కింది. 2024 మార్చి 12న దిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.లక్ష చొప్పున నగదుతో పాటుగా తామ్ర పత్రాన్ని బహూకరిస్తారు. 

కేంద్ర సాహిత్య పురస్కారం రావడంపై తల్లావజ్ఘల ఆనందం వ్యక్తం చేశారు.  సాహిత్య నేపథ్య కుటుంబ నుంచి వచ్చిన తనకు సహజంగానే రచనలపట్ల ఆసక్తి అలవడిందని తెలిపారు. సామాజిక వాస్తవిక దృక్పథం, అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసంలో బాధితులకు జరిగిన అన్యాయం వంటి అంశాలే తనకు కవిత్వం ఆసక్తిని కలగజేశాయని చెప్పారు. తెలుగుభాష అనేక మార్పులకు గురవుతోందని తెలిపారు. ఇంజినీరింగ్, వైద్యంతోపాటు వివిధ కోర్సుల్లోనూ తెలుగు భాష ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడే తెలుగు భాష మరింతగా వికసిస్తుందని అన్నారు. పతంజలి శాస్త్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details