ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tahsildar_and_collector_not_care_old_people_land_issue

ETV Bharat / videos

'డబ్బుల కోసం భూసమస్యను పట్టించుకోని అధికారులు' - వృద్ధ దంపతుల ఆవేదన - వృద్ధుల భూ సమస్యపై పట్టించుకోని తహశీల్దార్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 12:27 PM IST

Tahsildar And Collector Not Care Old People Land Issue: భూ సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్‌, కలెక్టర్‌ చుట్టూ తిరిగినా తమ సమస్య తీరలేదని గుంటూరుకు చెందిన వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన సుభానీ అనే విశ్రాంత ఉద్యోగి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో తన భార్య పేరిట రెెండు ఎకరాల భూమిని 2013లో కొనుగోలు చేశారు. నీటి కోసం ఈ ఏడాది మార్చిలో బోరు వేయించి విద్యుత్ కనెక్షన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 

అధికారులు వాల్టా చట్ట పరిధిలోని నిబంధనల కోసమంటూ తహసీల్దార్‌ను సంప్రదించాలని చెప్పడంతో అనేక సార్లు అతని వద్దకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన దంపతులు మీ సమస్య పరిష్కారమైనట్లు ఫోన్​కు సందేశం వచ్చిందని తెలిపారు. కానీ వాస్తవానికి ఆ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్వో సర్టిఫికెట్లు ఇవ్వటం కోసం డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. అధికారులు డబ్బుల కోసం పదే పదే కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు అసహనానికి గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details