ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tadipatri_municipal_chairman_jc_prabhakar_reddy_serious_on_govt-due-to_farmer_suicide

ETV Bharat / videos

జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన కారణంగానే రైతుల ఆత్మహత్యలు: జేసీ ప్రభాకర్ రెడ్డి - రైతు ఆత్మహత్యపై జేసీ ప్రభాకర్​ వ్యాఖ్యలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 7:06 PM IST

Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy Serious on Govt Due To Farmer Suicide : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలనతో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల పరిధిలోని గోవిందు అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పామిడి ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రైతు గోవింద మృతదేహాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి సందర్శించి, అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

రైతు గోవిందు​కు మూడేళ్లుగా సాగు చేస్తున్న పత్తి పంట చేతికి రాక, పెట్టుబడికి, కుమార్తెల పెళ్లిళ్లకు చేసిన అప్పులు పెరిగిపోయాయని తెలిపారు. వాటిని తీర్చే మార్గం లేక రైతు గోవిందు(55) పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. ప్రభుత్వం గోవిందు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల కుటుంబాలను ఆదుకోవాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details