ఆంధ్రప్రదేశ్

andhra pradesh

swamiji Donation of gold coin necklace to Goddess Sri Padmavati

ETV Bharat / videos

Swamiji Gold Coin Necklace Donation: శ్రీవారిని దర్శించుకున్న కాశీ మఠం మఠాధిపతి.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి కాసుల హారం - Tirumala information

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 5:45 PM IST

Swamiji Donation of Gold Coin Necklace to Goddess Sri Padmavati :తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శ్రీ కాశీ మఠం మఠాధిపతి శ్రీమద్ సంయమింద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి బంగారు కాసుల హారాన్ని విరాళమివ్వాలని ముందుగా ఈరోజు తిరుమలకు చేరుకొని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమలలో స్వామీజీకి సంప్రదాయ పద్ధతిలో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కాసుల హారాన్ని ఆలయం వెలుపల భక్తులకు, మీడియాకు చూపించారు. మఠాధిపతిని చూసేందుకు భక్తులు, ఇతర స్వామీజీలు తరలి వచ్చారు. 

రేపు ఉదయం తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకుని కాసుల హారాన్ని అక్కడి ఆలయ అధికారులకు సంప్రదాయ పద్ధతిలో విరాళంగా సమర్పించనున్నట్లు స్వామీజీ తెలిపారు. ఈ బంగారు కాసులపై లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారి రూపాలను ముద్రించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. ఈ హారాన్ని తయారుచేయటం కోసం 60 బంగారు కాసులను ఉపయోగించారు. అమ్మవారికి అలంకరణ కోసం తయారుచేయించిన ఈ హారం విలువ రూ.49 లక్షల విలువ ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details