ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Suryanarayana Anticipatory

ETV Bharat / videos

KR Suryanarayana: సూర్యనారాయణ ముందస్తు బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ - సూర్యనారాయణ ముందస్తు బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

By

Published : Jun 15, 2023, 8:55 PM IST

Suryanarayana Anticipatory Bail Petition Rejected: విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడ ఏడీజే కోర్టు తిరస్కరించింది. తనకు ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోలీసులు తాజాగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టాన్ని జోడించి ఎఫ్​ఐఆర్​ను ఆల్టర్ చేసి కోర్టు ముందు ఉంచారు. అయితే పిటిషన్ విచారణ ఈ కోర్టు పరిధికి రాదన్న న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్​ పిటిషన్​ను తిరస్కరించారు. అదే సమయంలో తనపై పటమట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ.. కేఆర్ సూర్యనారాయణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details