PRATHIDWANI: స్థానిక భాషల్లోకి సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు - local languages
PRATHIDWANI: స్థానిక భాషల్లోకి సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు.. న్యాయవ్యవస్థను సామాన్యుడికి మరింత చేరువ చేసే క్రమంలో సుప్రీంకోర్టు తీసుకున్న మరో కీలక నిర్ణయం ఇది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్. క్రమంగా... దేశంలో గుర్తింపు పొందిన అన్ని భాషల్లో సుప్రీం తీర్పు ప్రతులను అందుబాటులోకి తీసుకుని వస్తామనీ ఈ సందర్భంగా ప్రకటించారు సీజేఐ. మరి ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏమిటి. కేవలం ఆంగ్లంలోనే కాక భారతీయ భాషల్లో కోర్టు తీర్పులు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆ క్రమంలో అధిగమించాల్సిన అంశాలు ఏమిటి.. సామాన్యుడి కోణంలో న్యాయవ్యవస్థలో ఇంకా ఎలాంటి సంస్కరణలు అవసరం. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
ఇవీ చదవండి :