Sunitha Pays Tribute to YS Viveka : సీబీఐ దర్యాప్తులో ఎవరి జోక్యం ఉండకూడదు: సునీత - YS Sunitha Pays Tribute to YS Vivekananda Reddy
Sunitha Pays Tribute to YS Viveka: వివేకానందరెడ్డి 72వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత పులివెందులలో వివేకా సమాధి వద్ద నివాళులర్పించారు. కుటుంబంతో కలసి కేక్ కట్ చేశారు. చిన్నప్పుడు తండ్రి తనకు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయని సునీత కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరైనా మనల్ని పొగిడితే పెద్దగా పట్టించుకోకూడదు అని,.. విమర్శిస్తే మాత్రం తప్పులు సరిదిద్దుకోవాలని ఆమెకు వివేకా సూచించారని అన్నారు. తన తండ్రి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని.. దర్యాప్తు సంస్థలు వారి పని వారు చేసుకునే విధంగా స్వేచ్ఛ కల్పించాలని.. ఇందులో ఎవరి జోక్యం ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు.
"నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అనుకుంటా.. ఎవరో ఏదో అన్నారని నేను చాలా బాధ పడుతున్నాను. ఆ సమయంలో నాన్న.. ఎవరైనా పొగిడితే పట్టించుకోకూడదని.. విమర్శిస్తే తప్పులు సరిదిద్దుకోవాలని నాకు సూచించారు. నాన్న హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు సంస్థలు వారి పనిని వారు చేసుకునే విధంగా స్వేచ్ఛ కల్పించాలి. ఇందులో ఎవరి జోక్యం ఉండకూడదు." - సునీత, వివేకా కుమార్తె
TAGGED:
YS Vivekananda Reddy news