Snow Falling in Paderu: మండు వేసవిలోనూ కురుస్తున్న మంచు.. వేసవి విడిదిగా మారిన పాడేరు - అల్లూరి సీతారామరాజు జిల్లా లేటెస్ట్ న్యూస్
Snow Falling in paderu: రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి భూవాతావరణం వేడెక్కిపోతోంది. గత కొన్ని రోజులుగా సూర్యుడి వేడికి అగ్నిగోళంగా మారిపోయింది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. వడగాల్పులతో రాష్ట్ర ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ తగిలి చాలామంది మృత్యువాత కూడా పడుతున్నారు. అయితే అందుకు భిన్నంగా ఆ ప్రాంతంలో ఎండాకాలంలోనూ మంచు కురుస్తోంది. ఆ ప్రాంతాన్ని ఉదయం సమయంలో మంచు దుప్పటి కమ్మేస్తోంది. రాష్ట్రమంతా ఇంచుమించు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. భానుడి ప్రతాపానికి అగ్నిగోళంలా మారితే.. ఆ ప్రాంతంలో మంచు ఆహ్లాదాన్ని పంచుతోంది. అక్కడ కనిష్ఠంగా 20 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదవుతూ.. భిన్నమైన అనుభూతిని కల్పిస్తోంది. దీంతో ప్రకృతి ప్రేమికులకు ఆ ప్రాంతం వేసవి విడిదిగా మారింది. అది ఎక్కడో కాదండోయ్.. మన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులోనే.. అక్కడ మంచు కురుస్తున్న దృశ్యాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీంతో పాదచారులు, స్థానికులు మంచు అందాలలో ఆనందంగా గడుపుతున్నారు.