ఆంధ్రప్రదేశ్

andhra pradesh

film_chamber_opening

ETV Bharat / videos

ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాలి - ఫిలిం ఛాంబర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సుమన్ - andhra pradesh latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 3:51 PM IST

Suman inaugurated newly established Film Chamber office: ఆంధ్రప్రదేశ్​లో కనీస అవసరాలతో ఫిలిం సిటీని నిర్మిస్తే షూటింగుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(ANDHRA PRADESH FILM CHAMBER OF COMMERCE) కార్యాలయాన్ని గురువారం సుమన్ ప్రారంభించారు. ఏపీలో సినిమా చిత్రీకరణకు అనేక విధమైన లొకేషన్లు ఉన్నాయని అన్నారు. ఆ లొకేషన్లలో ప్రభుత్వం కనీస వసతులు ఏర్పాటు చేస్తే సినీ పరిశ్రమల వారికి మరింత ప్రయోజనం ఉంటుందని సుమన్ అభిప్రాయపడ్డారు. 

ఈ ప్రారంభోత్సవంలో సినీ నటులు సుమన్​కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి నూతనంగా ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని చర్యలు తీసుకుంటుందని అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో సినీ నటులు సుమన్​కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి నూతనంగా ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని చర్యలు తీసుకుంటుందని అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ చెప్పారు.

హైదరాబాద్​లో ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్​లో కూడా తెలుగు చిత్రపరిశ్రమకు మేము అంతా కృషి చేస్తాం. సుమన్ చేతుల మీదుగా ప్రారంభించడం మా అందరికీ బలం. గోదావరి ప్రాంతాల్లో జరిగే సినిమాలు అన్నీ విజయం సాధిస్తున్నాయి.- ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, మధు

ABOUT THE AUTHOR

...view details