ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైభవంగా సూళ్లూరుపేట చెంగాళమ్మ తిరునాళ్లు

ETV Bharat / videos

Sullurpet Chengalamma Tirunallu: వైభవంగా సూళ్లూరుపేట చెంగాళమ్మ తిరునాళ్లు.. పోటెత్తిన భక్తులు - తిరుపతి జిల్లా లేటెస్ట్ న్యూస్

By

Published : Jun 11, 2023, 4:25 PM IST

Sullurpet Chengalamma Tirunallu: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ తిరునాళ్లలో అతి ముఖ్య ఘట్టమైన మహిషాసుర మర్దిని కార్యక్రమం వైభవంగా సాగింది. శనివారం రాత్రి సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ఆవరణ అంతా భక్త జనంతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే సంజీవయ్య, ఆలయ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఛైర్ పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తదితర ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో బాణసంచా కనువిందు చేసింది. ఈ ఉత్సవంలో భాగంగా మహిషాసుర మర్దిని కార్యక్రమ ఘట్టానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దొరవారిసత్రం మండలం లింగంపాడుకు చెందిన ఓ యువకుడు విద్యుతాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details