ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ నేతలతో సుజనా చౌదరి భేటీ.. హాట్ టాపిక్​గా మారిన ఇరు నేతల సమావేశం - సుజనా చౌదరి భేటీ వీడియోలు

🎬 Watch Now: Feature Video

సుజనా చౌదరి

By

Published : Apr 2, 2023, 8:07 PM IST

Updated : Apr 3, 2023, 6:39 AM IST

గుంటూరులో బీజేపీ నేత సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వివిధ రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ పై వైకాపా వర్గీయుల దాడిని ప్రధానంగా చర్చించారు.  అమరావతి రైతుల కోసం బీజేపీ నేత సత్య కుమార్ వస్తే వైకాపా నేతలు దాడులు చేయడం దారుణమన్న సుజనా...వైకాపాకు ప్రజలు బుద్దిచెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా వైకాపా నేతలు తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందని... రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా మూడు రాజధానుల పేరుతో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుందని...ప్రజాస్వామ్యవాదులందరు రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి పోరాటం చేయాలని మాజీమంత్రి,  ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. కేవలం తమకు ఉన్న పాత పరిచయాలతో టీ పార్టీకి పిలిచామని టీడీపీ నేత వెల్లడించారు. 

Last Updated : Apr 3, 2023, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details