Suicide Attempt: ఎస్సై కొట్టాడంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీస్‌స్టేషన్ వద్ద కుటుంబసభ్యుల ఆందోళన - tripuranthakam news
Man Suicide Attempt: పోలీస్‌స్టేషన్‌కు పిలిచిన ఎస్సై.. తనను అన్యాయంగా కొట్టాడంటూ ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగింది. ఈ నెల 8వ తేదీన త్రిపురాంతకంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఒక వర్గంపై మరొక వర్గం వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై వెంకట సైదులు ఇరువర్గాల వారిని పిలిచి మందలించే క్రమంలో చల్లా గురవారెడ్డిపై చేయి చేసుకున్నారు. అవమానానికి గురైన ఆయన ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్సై తీరుతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. స్టేషన్ లోపలున్న వర్గం వారిపై దాడి చేసేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్.. బాధితుని కుటుంబసభ్యులతో మాట్లాడి.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.