ఆంధ్రప్రదేశ్

andhra pradesh

suicide_attempt_at_collectorate_in_annamayya-_district

ETV Bharat / videos

Suicide Attempt at Collectorate in Annamayya District : ఆర్డీవో ఎదుట పురుగుమందు తాగి సామాన్యుడి ఆత్మహత్యాయత్నం.. అసలేమైందంటే..?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 4:34 PM IST

Suicide Attempt at Collectorate in Annamayya District : ఇంటి స్థలం విషయమై కలెక్టర్‌ కార్యాలయంలో శ్రీరాములు అనే వ్యక్తి  ఆత్మహత్యకు యత్నించిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఉన్న ఆర్డీవో మురళి ఎదుట శ్రీరాములు అనే వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రామసముద్రం మండల కేంద్రానికి చెందిన శ్రీరాములు స్థానికంగా ఇంటిని నిర్మించుకోవడానికి స్థలం ఏర్పరచుకున్నాడు. కాగా, ఇదే స్థలంలో గతంలో చెక్​ పోస్ట్ ఉండేదని ఈ ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని అధికారులు, స్థానిక నాయకులు సూచించారు.

Suicide in Front of RDO in Madanapalle AP :దీంతో తనకు న్యాయం చేయాలని శ్రీరాములు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చాడు. ఆర్డీవో ఈ విషయమై అతనితో మాట్లాడుతుండగానే కొంతసేపటికి తన వెంట తెచ్చుకున్న పురుగుమందు డబ్బాను తెరిచి అక్కడే తాగి కింద పడిపోయాడు. కార్యాలయం సిబ్బంది 108 వాహనానికి ఫోన్ చేసి.. హుటాహుటిన అతడ్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఈ సంఘటనపై ఆర్డీవో మాట్లాడుతూ.. ఆ స్థలంపై శ్రీరాములుకు ఎలాంటి హక్కు లేదని తెలిపారు. దీనికి సంబందించిన నోటీసులు కూడా జారీ చేశామని ఆర్డీఓ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details