ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cell_tower

ETV Bharat / videos

బకాయిలు చెల్లించలేదని సెల్​ టవర్​ ఎక్కిన సబ్​ కాంట్రాక్టర్​ - nandhyala cell tower news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 7:39 PM IST

Sub Contractor Climbed the Cell Tower for Pending Bills : చేసిన పనులకు బకాయిలు చెల్లించలేదని ఓ సబ్​ కాంట్రాక్టర్​ మనస్థాపంతో ఏకంగా సెల్​టవర్​ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సంఘటన నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో చోటు చోసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి రోడ్డు పనులు చేస్తుంటారు. మరో కాంట్రాక్టర్​ దగ్గర పనులు తీసుకుని డోన్​ నియోజకవర్గంలో పలు చోట్ల 8 వంతెనలు నిర్మించారు. పనులు పూర్తి అయ్యి ఆరు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదని బాధితుడు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.

స్థానికంగా వంతెనలు నిర్మించేందుకు అప్పులు చేసి, పనులు పూర్తి చేశానని వాపోయాడు. బకాయిలు చెల్లించడంలో కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం చేస్తున్నాడని పేర్కొన్నారు. అప్పుల పాలైన తాను ఏం చేయాలో తెలియక సెల్​టవర్​ ఎక్కినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేస్తానని పోలీసులు అధికారులు తెలిపినా వినలేదు. తనకు రావాల్సిన రూ.12 లక్షలు చెల్లిస్తేనే కిందకు దిగుతానని స్పష్టం చేశాడు. 

ABOUT THE AUTHOR

...view details