'ఆడుదాం ఆంధ్రా సరే - ఆట స్థలాలేవీ, ఉద్యోగాల మాటేమిటి? ' - youth against to cm jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 6:09 PM IST
Students Protest Against CM Jagan In Guntur District :ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుట్టుగుంట సెంటర్లో యువత, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ఆడుదాం ఆంధ్రా సరే ఆట స్థలాలు ఎక్కడా అంటూ నిలదీశారు. ప్రభుత్వ స్టేడియంలను పట్టించుకోకుండా పాడుబడేలా చేసి, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆటలా? అంటూ మండిపడ్డారు.
Adudam Andra In Guntur Youth Protest Against YSRCP GOvt : ఆడుదాం ఆంధ్రా కాదు అడుగుదాం ఆంధ్రా అంటూ ఉద్యోగాలు ఎక్కడ అంటూ నిరసన కారులు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం యువత పట్ల వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. నిరసన చేస్తున్న యువత, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.