ఆంధ్రప్రదేశ్

andhra pradesh

students_hunger_strike_against_chandrababu_arrest

ETV Bharat / videos

Students Hunger Strike Against Chandrababu Arrest: మూడోరోజుకు చేరిన విద్యార్థుల నిరాహార దీక్ష... "చంద్రబాబును విడుదల చేసే వరకూ కొనసాగిస్తాం" - చంద్రబాబు నాయుడు అరెస్తు వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 2:19 PM IST

Students Hunger Strike Against Chandrababu Arrest :తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విద్యార్థులు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు పొట్లూరి దర్షిత్, రేపాకుల శ్రీనివాస్.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారానికి మూడో రోజుకు చేరింది. విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తుండటం పట్ల వారి తల్లిదండ్రులు, తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళన వ్యకం అవుతోంది. రాష్ట్రంలో యువత భవిత కోసం చంద్రబాబు నిరంతరం పాటు పడ్డ వ్యక్తి అని తెలిపారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యా విధానాన్ని ప్రోత్సహించారని, ఎందరో తెలుగు వారు ఐటీ ఉద్యోగస్థులుగా స్థిరపడటానికి చంద్రబాబు కృషి చేశారని కొనియాడారు. చంద్రబాబుకు యువజన, విద్యార్ధి లోకం మొత్తం మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు విడుదల అయ్యేంత వరకూ తమ దీక్షను కొనసాగిస్తామని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details