ఆంధ్రప్రదేశ్

andhra pradesh

two_-road_accidents

ETV Bharat / videos

అతివేగానికి ఇద్దరు బలి - రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బైక్, కారు - వేరువేరుచోట్ల రెండు ఊహించని రోడ్డు ప్రమాదాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 12:34 PM IST

Students Bike Accident In Kuchivariplli: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న పవన్‌, రోహిత్‌ అనే విద్యార్థులు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో పవన్‌ అక్కడికక్కడే మృతి చెందగా రోహిత్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పవన్‌ సోదరి కన్నీటి దుఃఖంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Car Accident In Bapatla District: బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకుపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కారు తెలంగాణా రాష్ట్రం రిజిస్ట్రేషన్​తో ఉందని అద్దంకి నుంచి దర్శి వైపు వెళుతున్నట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కారులో ఒక్కరు మాత్రమే ఉన్నారని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మృతుని వివరాలు తెలియాల్సి ఉందన్నారు

ABOUT THE AUTHOR

...view details