చాలీచాలని భోజనం పెడుతున్నారంటూ ఎస్సీ విద్యార్థులు నిరసన - వార్డెన్‌పై చర్యలు తీసుకోవాని డిమాండ్ - Hostel students protest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 2:05 PM IST
Students Agitation at SC Social Welfare Boys Hostel: చాలీచాలని భోజనం పెడుతున్నారంటూ ఎస్సీ సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆందోళన చేపట్టిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో విద్యార్థులు చాలీచాలని భోజనం పెడుతున్నారంటూ గత రాత్రి చినగదిలి మండల తహశీల్దార్ కార్యాలయం పక్కన గల ఎస్సీ బాలుర వసతి గృహంలో నిరసన (Protest at SC Boys Hostel) కార్యక్రమం నిర్వహించారు. తమకు పెట్టే చాలీచాలని భోజనం కూడా రోజువారి సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
వంట పాత్రలను ఎదురుగా పెట్టుకుని విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిరోజు అర్దాకలితో పడుకుంటున్నామని వాపోయారు. వెంటనే వార్డెన్ వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకొని వార్డెన్‌పై చర్యలు తీసుకుని విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.