ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటు

ETV Bharat / videos

YSR Statue: యూనివర్శిటీలో వైయస్ విగ్రహమా? వీసీని రీకాల్ చేయాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్! - politicians Statues in universities

By

Published : Jul 21, 2023, 2:59 PM IST

 YS Rajasekhara Reddy Statue Installation In Sri Krishnadevaraya University: అనంతపురం జిల్లాలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని.. విద్యార్థి సంఘాల నాయకులు ఖండించారు. చదువులకు నిలయమైన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఏం సందేశాలు ఇస్తారని వారు ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆవరణలో ఏఐఎస్ఎఫ్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న యూనివర్సిటీ ఉపకులపతి రామకృష్ణారెడ్డిని రీకాల్ చేయాలని.. వారు డిమాండ్ చేశారు. యూనివర్శిటీలో విద్యార్థులకు మంచి విద్యను అందించటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. వర్శిటీని ఎలా అభివృద్ధి చేయాలనేది వదిలేసి ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని వారు మండిపడ్డారు. చదువులు చెప్పాల్సిన చోట రాజకీయ నాయకుల విగ్రహాలతో..  విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు తాకట్టు పెట్టే విధంగా ఉపకులపతి రామకృష్ణారెడ్డి ప్రవర్తిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడ్తమని వారు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details