కళాశాల విద్యార్థిని ఆత్మహత్య - కాలేజీ యాజమాన్యం ఏం చెప్తోందంటే! - నరసరావుపేట ఎన్ఈసీ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 2:39 PM IST
Student Suicide in Palnadu District : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎన్ఈసీ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యల రీత్యా తలకు రాసుకునే ఆయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థిని మృతదేహాన్ని కళాశాల సిబ్బంది నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మల్లవరం గ్రామానికి చెందిన విద్యార్థిగా బంధువులు తెలిపారు. చదువుకోసం పల్నాడుకు వెళ్లి విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చాసి మృతురాలి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
NEC Collage Student Suicide 2023 In Narasarao Peta : సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్న కూతురు అకస్మిక ఆత్మహత్య చూసి మృతురాలి తండ్రి నోట మాట రావడంలేదు. విద్యార్థిని ఆత్మహత్య కేసు నమోదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. అనారోగ్య సమస్యలతో సతమత మవుతూ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిందని కళాశాల యాజమాన్యం పేర్కొన్నారు.