ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Student_Father_Suicide_Attempt

ETV Bharat / videos

వాలంటీర్ భర్త పెత్తనం - 'జగనన్న విద్యాదీవెన' రాలేదని విద్యార్థిని తండ్రి ఆత్మహత్యాయత్నం - village volunteer work

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 1:10 PM IST

Student Father Suicide Attempt :జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena) రాలేదంటూ ఓ విద్యార్థిని తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరులో చోటుచేసుకుంది. కడమలకుంట గ్రామానికి చెందిన బోయ కల్యాణి డిగ్రీ చదువుతోంది. ఆమెకు జగనన్న విద్యాదీవెన డబ్బులు రాలేదు. ఆ ఊర్లో గ్రామ వాలంటీరు గంగదేవి భర్త చంద్ర వాలంటీరు పనులన్నీ చూస్తున్నారు. ఈ విషయంపై ఆమె తండ్రి వెంకటేశులు చంద్రను పలుమార్లు సంప్రదించారు. 

Jagananna Vidya Deevena For Students :  విద్యా దీవెనతో తమకు సంబంధం లేదని, కళాశాలకు వెళ్లే అడుక్కో లేకుంటే సచివాలయానికి వెళ్లంటూ చంద్ర దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వాలంటీరు భర్తే విద్యాదీవెన రాకుండా అడ్డుకుంటున్నారని గురువారం పోలీసు స్టేషన్​లో మౌఖికంగా ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పడంతో మనస్తాపం చెందిన బాధితుడు వజ్రకరూరు పోలీసు స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగారు. గమనించిన పోలీసులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉరవకొండ ఆసుపత్రిలో పోలీసులు బాధితుడి వివరాలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details