ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Attack on Minister Vidadala Rajini Office at Guntur

ETV Bharat / videos

నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబుల విధ్వంసం - ఆ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి! - వైసీపీ నేతలపై టీడీపీ దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 7:49 AM IST

 Attack on Minister Vidadala Rajini Office at Guntur:గుంటూరులో నూతన సంవత్సరంలో భాగంగా అర్ధరాత్రి రోడ్లపై మందుబాబులు విధ్వంసం సృష్టించారు. చంద్రమౌళి నగర్‌లోని మంత్రి విడదల రజిని పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వగా, కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా మంత్రి విడదల రజిని నియమితులయ్యారు. అయితే, నిన్న అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంపై దాడి చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన  నాయకులే తమ కార్యాలయంపై రాళ్లు విసిరారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మరోవైపు మంత్రి రజిని కార్యాలయంపై దాడికి తమకు ఎలాంటి సంబంది లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న అంతర్గత కలహాలవల్లే కార్యాలయంపై దాడికి కారణాలై ఉంటాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పోలీసులు నిందితులను విచారిస్తున్నామని తెలిపారు. త్వరలోనే కార్యాలయంపై దాడి చేసిన వారి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details