ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Construction of houses in R-5 zone

ETV Bharat / videos

Houses proposals in R5 zone ఆర్-5 జోన్‌ ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి ప్రతిపాదనలు.. - Amaravati news

By

Published : May 19, 2023, 8:16 PM IST

Construction of houses in R-5 zone: రాజధానిలోని ఆర్ 5 జోన్​లో ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సీఆర్డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్​లో 47 వేల 17  ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించారు. రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఈ ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆర్ 5 జోన్​లో గుంటూరు- ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 51 వేల 392 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం 47వేల 17 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. షీర్ వాల్ టెక్నాలజీని వినియోగించి సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. 

ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలోనే ఇంటి మంజూరు పత్రాలను కూడా లబ్దిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లస్థలాల లబ్దిదారుల సంఖ్య ఇళ్ల నిర్మాణం కోసం పంపిన ప్రతిపాదనల సంఖ్యలో వ్యత్యాసం ఉండటంతో 4 వేల 375 మంది లబ్దిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోవైపు సీఆర్డీఏలో ఇళ్ల స్థలాల లేఆవుట్ల అభివృద్ధికి 50 కోట్లను సీఆర్డీఏ కేటాయించింది. ఇప్పటికే లే అవుట్​ల అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు యుద్ధప్రాతిపదికన సీఆర్డీఏ వ్యయం చేసింది.

ABOUT THE AUTHOR

...view details