ఆంధ్రప్రదేశ్

andhra pradesh

state_government_is_negotiating_the_municipal_workers

ETV Bharat / videos

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించాలి: ఆదిమూలపు సురేష్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 8:47 PM IST

State Government is Negotiating the Municipal Workers:రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె విరమించాలని, ఆయా సంఘాలతో చర్చలు జరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. చర్చల అనంతరం వారి డిమాండ్​ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. నాన్ పీహెచ్ కేటగిరీ ఉద్యోగులకు 6వేల రూపాయల ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ (Occupational Health Allowance) ఇస్తామని మంత్రి తెలిపారు. స్కిల్ సిబ్బంది విషయంలో కొన్ని సమస్య లు తలెత్తాయన్నారు. రోస్టర్, పీఫ్, ఎక్స్ గ్రేషియా వంటి అంశాలను పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. మరికొన్ని అంశాలపై మరోమారు చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. అప్పటి వరకూ కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నామన్నారు. 

సమాన పనికి సమాన వేతనం అని నవరత్నాలలో పేర్కొన్నామన్నారు. ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. బేసిక్‌, హెల్త్‌ అలవెన్స్‌ కలిపి ఇవ్వాలని పట్టుపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. కేవలం 50 మున్సిపాలిటీల్లో మాత్రమే ఈ సమ్మె ప్రభావం ఉందన్నారు. సమ్మె కారణంగా ఇబ్బందులు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details