ఆంధ్రప్రదేశ్

andhra pradesh

state_government_corruption_in_provision_of_tabs_given_to_students

ETV Bharat / videos

ట్యాబుల కుంభకోణం డబ్బులతో అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించవచ్చు: సీపీఎం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 4:09 PM IST

State Government Corruption In Provision Of Tabs Given To Students: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ట్యాబులు వాటికి అవసరమైన కంటెంట్ సమకూర్చడంలో రూ.1250 కోట్ల అవినీతి జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గత ఏడాది 9వేల రూపాయల విలువ చేసే ఒక్కో ట్యాబుని 13వేల రూపాయలకు కొనుగోలు చేశారని తెలిపారు. దీనిలో ఒక్కో ట్యాబుకి 4వేల రూపాయలు అధికార పార్టీ నాయకులు దండుకున్నారని మండిపడ్డారు. ఈ ట్యాబులకు కావాల్సిన కంటెంట్​లోనూ వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న బైజూస్ వంటి సంస్థలకు ఈ ట్యాబులను, వాటికి కావాల్సిన కంటెంట్​ను అందించే బాధ్యతను జగన్ ప్రభుత్వం అప్పగించిందని మండిపడ్డారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ జగన్ సర్కార్ అబద్ధాలు చెబుతుందని ఆక్షేపించారు. ఈ కుంభ కోణంలో జరిగిన అవినీతి డబ్బులతో అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించడమే కాకుండా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయవచ్చని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details