ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన బకాయిలు- బయట నుంచి ఆహారం తెప్పించుకుంటున్న పేషంట్లు - Konaseema hospital

🎬 Watch Now: Feature Video

hospital

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 1:41 PM IST

Stalled Food Supply in Government Hospital in Konaseema District :కోనసీమ జిల్లా పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేసే ఆహారం నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి సుమారు 2 లక్షల 50 వేల రూపాయల వరకు బకాయిల రావాలని గుత్తేదారుడు వాపోతున్నారు. ఇంతకాలం అప్పు తెచ్చి సరఫరా చేశామని బిల్లులు రాకపోవడం వల్ల భోజనాల సరఫరా నిలుపుదల చేశామని గుత్తేదారుడు తెలిపారు.

Patients Suffering From Food Shortages :భోజన సరఫరా నిలిచిపోవడం వల్ల రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో రోగులు, గర్భణీలు బయట నుంచి భోజనాలు తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి తమకు భోజన సౌకర్యాలు కల్పించాలని రోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి కొంతమందికి ఆహారం అందించారు. వైద్యుడి విజ్ఞప్తి మేరకు నెలరోజుల పాటు ఆహారాన్ని సరఫరా చేయడానికి గుత్తేదారుడు ఒప్పుకున్నాడని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. తానుకు రాాావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని గుత్తేదారుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details