పది రోజులుగా నిలిచిపోయిన మంచినీటి సరఫరా - పట్టించుకోని అధికారులు - Lack of Drinking Water
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2024, 10:29 PM IST
Stagnant Water Due to Repair of Drinking Water Pipes : తాగునీటి పైపుల మరమ్మతు కారణంగా పది రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడం వల్ల నెల్లూరు జిల్లా వాసులకు అవస్థలు తప్పడం లేదు. తమ గ్రామ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఆత్మకూరు మండలం బట్టిపాడుకు చెందిన గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి తాగునీరు సరఫరా చేసే కాంట్రాక్టర్కు గత 6 నెలలుగా అధికారులు బిల్లులు చెల్లించలేదని వాపోయారు. దీంతో నీళ్లు సరఫరాపై కాంట్రాక్టర్ చేతులెత్తేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Villagers are Suffering Due to Lack of Drinking Water :గ్రామంలో తాగునీటీ సరఫరా నిలిచిపోవడం వల్ల సుమారు 2 కిలోమీటర్లు దూరం వెళ్లి తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. అవి కూడా త్రాగేందుకు మాత్రమే సరిపోతాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ సర్పంచ్ దళితుడు కావటం వల్లనే అధికారులు సమస్యపై చొరవ చూపడం లేదని ఆరోపించారు. తాగునీటి పైపుల మరమ్మతులు చేయించి, తమకు తాగునీరు అందేలా చూడాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.