ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీరామ్​రెడ్డి తాగునీటి పథకం పైప్​లైన్

ETV Bharat / videos

Water Pipeline Burst: పగిలిన వాటర్​ పైప్​లైన్​.. మూడు నియోజకవర్గాలకు నిలిచిన నీరు - శ్రీరామ్​రెడ్డి తాగునీటి పైప్‌లైన్‌ పగిలింది

By

Published : Jun 13, 2023, 9:55 PM IST

Sriram Reddy Drinking Water Scheme: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలోని శ్రీరామ్​రెడ్డి తాగునీటి పథకానికి సంబంధించిన పైప్ పగిలిపోయింది. దీంతో మోటార్లను నిలిపివేశారు. మోటార్లు నిలిచిపోవడంతో మూడు నియోజకవర్గాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు శ్రీరామ్​రెడ్డి తాగునీటి పథకం ద్వారా.. నీటి సరఫరాను అందిస్తున్నారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం శివారులోని పంప్ హౌస్​లో పైపు పగిలిపోయింది. దీంతో నీటి లీకేజీ కారణంగా మోటార్ల స్థాయి వరకు నీరు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది మోటార్లను ఆపేశారు. 

కొంతమేర మోటార్లు మునిగిపోవడంతో హుటాహుటిన అధికారులు పంపు హౌస్​కి చేరుకొని నీటిని తోడివేసే పనులు ప్రారంభించారు. మోటార్లు ఆగిపోవడం వలన జిల్లాలోని హిందూపురం, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.  మోటార్లలోకి నీరు వెళ్లకుండా ఉంటే వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని.. లేకుంటే రెండు రోజులు పడుతుందని   శ్రీరామ్​రెడ్డి తాగునీటి పథకం డీఈఈ శ్రీనివాస్ స్పష్టం చేశారు. పగిలిపోయిన పైపును వెల్డింగ్​ చేసి.. బుధవారం ఉదయానికి పనిచేసేలా చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ తెలిపారు.
 

ABOUT THE AUTHOR

...view details