ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Srikalahasti

ETV Bharat / videos

Srikalahasti municipal staff remove TDP flexees: శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత.. టీడీపీ ఫ్లెక్సీలను తొలగించిన పురపాలక సిబ్బంది - Controversy of flexions in Srikalahasti

By

Published : Aug 5, 2023, 12:50 PM IST

Srikalahasti municipal staff remove TDP flexees: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్యానర్లను, ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను చించేసి విధ్వంసం సృష్టిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చంద్రబాబు నాయుడి పర్యటనకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు పురపాలక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పురపాలక సిబ్బంది టీడీపీ ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. 

టీడీపీ ఫెక్ల్సీలను తొలగించిన పురపాలక సిబ్బంది..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. అనంతరం నెల్లూరు జిల్లాలో వివిధ వర్గాలతో భేటీకానున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ఆ పార్టీ శ్రేణులు స్వాగత ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఫ్లెక్సీలను తొలగించేందుకు శ్రీకాళహస్తి పురపాలక సిబ్బంది ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు.. అనుమతులున్నా కూడా ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారు..? అంటూ అడ్డుపడ్డారు. దీంతో పురపాలక శాఖ అధికారుల టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పురపాలక సిబ్బంది తొలగించిన ఫ్లెక్సీలను టీడీపీ నేతలు మళ్లీ ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details