ఆంధ్రప్రదేశ్

andhra pradesh

srikakulam_tdp_leaders_cycle_yatra_reaches_etcherla

ETV Bharat / videos

Srikakulam TDP Leaders Cycle Yatra Reaches Etcherla: సైకిల్ యాత్ర సక్సెస్.. కార్యకర్తలకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు - శాంతియుతంగా సైకిల్ యాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 5:21 PM IST

Srikakulam TDP Leaders Cycle Yatra Reaches Etcherla:సైకిల్ యాత్ర ముగించుకొని తిరిగి జిల్లాకు వచ్చిన టీడీపీ కార్యకర్తలకు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం నేతలు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టారని.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి కుప్పం వరకు ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ టీడీపీ కార్యకర్తలు సైకిల్‌యాత్ర చేపట్టారు. శాంతియుతంగా సైకిల్‌యాత్ర చేస్తున్న వారిపై రౌడీయిజం చేసిన పెద్దిరెడ్డికి ప్రజలే తమ ఓటుతో బుద్ధి చెప్తారని మాజీ మంత్రి కళావెంకటరావు ధ్వజమెత్తారు. వైసీపీ సృష్టిస్తున్న అరాచకాలకు మరికొన్ని నెలల్లో తెరపడనుందని... ఓటమి భయంతోనే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
నారా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ... ఆయనకు సంఘీభావంగా ఈనెల 2వ తేదీన ఎచ్చెర్ల నుంచి కుప్పం వరకు రాష్ట్రంలో ఉన్న పుణ్య క్షేత్రాల దర్శనం చేస్తూ... టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు. ఇటీవలే పుంగనూరులో వైసీపీ నేతలు సృష్టించిన ఇబ్బందులను అధిగమించారు. నేడు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని గురువారం ఉదయం జిల్లాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సైకిల్ యాత్రలో పాల్గొన్న వారికి కిమిడి కళా వెంకట్రావుతో పాటుగా టీడీపీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details