కన్నుల పండువగా శ్రీ సీతారాముల రథోత్సవం.. ఎక్కడంటే! - AP Latest News
గత నెల మార్చి 29న దేశమంతటా శ్రీ రామనవమి సంబరాలు వైభవంగా జరిగాయి. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పలు ప్రాంతాల్లో భక్తులు శోభాయాత్రలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల వారి రథోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా సీతారామస్వామి కళ్యాణం నిర్వహించారు.. ఆ తర్వాత స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. మేళతాళాలు, కోలాటాలు ప్రదర్శనలతో గ్రామంలోని ప్రధాన రహదారిలో రథోత్సవం వైభవంగా సాగింది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా రెండవ రోజున రథోత్సవం జరపడం అనాదిగా.. వస్తున్న సంప్రదాయమని నిర్వాహకులు తెలిపారు.. భక్తులు భారీగా వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు.. ప్రమాదాలు జరగకుండా భారీగా పోలీసుల బందోబస్తు నిర్వహించారు.