ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sri_Raghavendra_Swamy_Aradhana_Mahotsavam_in_Kurnool

ETV Bharat / videos

Sri Raghavendra Swamy Aradhana Mahotsavam కన్నుల పండవగా రాఘవేంద్రస్వామి ఆరాధానోత్సవాలు.. హెలికాప్టర్​తో పూల వర్షం.. - కర్నూలు తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 7:18 PM IST

Sri Raghavendra Swamy Aradhana Mahotsavam in Kurnool : కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 352వ ఆరాధానోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహారథోత్సవాన్ని నిర్వహించారు. రథంపైకి హెలికాప్టర్​తో ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు హజరైయ్యారు. 

జిల్లాలో మంత్రాలయంలో 352వ రాఘవేంద్రస్వామి ఆరాధానోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహారథోత్సవాన్ని నిర్వహించారు. ఎంతో ఉత్సాహంతో భక్తులు రథాన్ని మఠం నుంచి రాఘవేంద్ర కూడలి వరకు తీసుకెళ్లారు. ఈ ఉత్సవానికి పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పాల్గొన్నారు. పీఠాధిపతి రాఘవేంద్ర స్వామి ప్రతిమను రథంపై ఉంచి మంగళ హారతిని ఇచ్చారు. ఈ ఉత్సవంలో రథంపైకి హెలికాప్టర్​తో ఆకాశం నుంచి పూల వర్షం కురిపిచటం భక్తులను ఆకట్టుకుంది. ఈ రథోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details