ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు

ETV Bharat / videos

Sri Chengalamma Parameshwari ఘనంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు - Latest News on Temples Of TIRUPATHI

By

Published : Jun 10, 2023, 8:56 PM IST

Chengalamma Parameshwari Brahmotsavam: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి అత్యంత వైభవంగా సుడిమానోత్సవం నిర్వహించారు. తొలుత ఆలయా పూజారులు అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదురుగా  సుడిమానుడి ప్రతిష్టించి ముక్కోటి దేవతలకు ఆహ్వనం పలికారు. ఈ సుడిమానోత్సవం మూడురోజుల పాటు నిర్వహిస్తారు. సంప్రదాయబద్ధంగా తడ మండలం గొల్లలములుపు గ్రామం నుంచి వడిబాల సాంగెం మేళతాళాలతో తెచ్చి అమ్మవారికి సమర్పించారు. మన్నారుపోలూరు గ్రామం నుంచి మంగమ్మ డప్పు వాయిద్యాలతో వీరతాళ్ల నడుమ ఆలయానికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో సుళ్ల ఉత్సవం కనులపండవగా సాగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయింది. దేవతామూర్తులను దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ ఉత్సవాలకు ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తలు వస్తున్నారు. చెంగాళమ్మ ఆలయంతో పాటు పలు కుడలి లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది.  ఆలయాలనికి వచ్చే భక్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహాకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details