ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SPF_Constable_Suicide_in_Kadapa_District

ETV Bharat / videos

ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్ బలవన్మరణం - వేధించిన అనారోగ్యం, అప్పుల బాధ - Kadapa District News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 12:20 PM IST

SPF Constable Suicide in Kadapa District : కడప విమానాశ్రయంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న నాయబ్ రసూల్ అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన నాయబ్ రసూల్ నాలుగేళ్లు నుంచి కడప విమానాశ్రయంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (Special Protection Force) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇతనికి ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాయబ్ రసూల్ కుంటుంబంతో  కడప జిల్లాలోని అలంకానిపల్లెలో నివాసం ఉంటున్నారు.

సంతానం కలగడం లేదన్న బాధతో పాటు ఇటీవల అప్పులు ఎక్కువ కావడంతో ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. మూడు రోజుల క్రిందట భార్య అనారోగ్యంగా ఉండడంతో పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్ మృతికి ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details