ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gali Janardhan Reddy Witness

ETV Bharat / videos

Security to Witness in OMC: ఓబుళాపురం అక్రమ మైనింగ్​ కేసు.. ప్రధాన సాక్షికి సెక్యూరిటీ - ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన సాక్షి

By

Published : Jun 22, 2023, 5:54 PM IST

Security to Main Witness in OMC: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన సాక్షి అయిన టపాల్ శ్యాం ప్రసాద్​ను సెక్యూరిటీతో కోర్టుకు తీసుకెళ్లడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు రంగం సిద్ధం చేశారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు సమాచారం ఇచ్చాడని కర్ణాటక ఎన్నికల కమిషన్​కు, ముఖ్యమంత్రికి శ్యాం ప్రసాద్ లేఖ రాశారు. అలాగే రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తమ మైనింగ్​లో అక్రమంగా మైనింగ్ వాడుకున్నారని ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ నేపథ్యంలో శ్యాంప్రసాద్ రాయదుర్గం మెజిస్ట్రేట్ కోర్టుకు రాయదుర్గం పోలీసుల పైన ఫిర్యాదు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని.. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టును సెక్యూరిటీ కోరినట్లు టపాల్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ నెల 23వ తారీఖున నాంపల్లి సీబీఐ కోర్టులో తన వాదన వినిపించాల్సి ఉందన్నారు. అందుకోసమే సీబీఐ సెక్యూరిటీతో ఇవాళే తాను బయలుదేరుతున్నట్లు చెప్పారు. తనకు సెక్యూరిటీ కల్పించిన కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details