రంగురంగుల కాంతులు.. వింతైనా ఆకారాల్లో బాణసంచా మెరుపులు - viral fire crackers
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. పండగ సంబరాలలో కొత్తపేటలో ఏర్పాటు చేసిన బాణసంచా కాల్పులు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. కొత్తపేటలోని పలు ఆలయాలకు చెందిన కమిటీలు బాణసంచా కాల్చారు. అవి మెరుపులను విరజిమ్ముతూ.. రంగుల వెలుగులతో ప్రకాశిస్తూ నింగికెగిశాయి. సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ప్రజలు వీటిని చూసి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. బాణసంచా విరజిమ్మిన రంగులు, ప్రకాశవంతమైన కాంతినిచ్చే దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. బాణసంచా రకరకాల ఆకారాలలో మెరుపులను విరజిమ్మటాన్ని.. స్థానికులు తమ సెల్ఫోన్లలో నిక్షిప్తపరుచుకున్నారు.