SP Preesmeet on Keerthana Incident: రావులపాలెం గౌతమి వంతెన వద్ద రక్షించిన బాలికను బంధువులకు అప్పగించిన పోలీసులు - రావులపాలెంలో కుటుంబాన్ని నదిలో తోసేసిన వ్యక్తి
SP Preesmeet on Keerthana Incident: కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద రక్షించిన కీర్తనను ఆమె తల్లి తాలూక బంధువులకు అప్పగించామని ఎస్పీ శ్రీధర్ తెలిపారు. గల్లంతయిన కీర్తన తల్లి సుహాసిని.. సోదరి జెర్సీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. బాధితులను నదిలోకి గెంటేసిన ప్రకాశం జిల్లా దర్శికి చెందిన సురేశ్‌పై కేసు నమోదు చేసి గాలిస్తున్నామన్నారు. గుడివాడకు చెందిన సుహాసిని తన భర్తతో విభేదాలు తలెత్తటంతో విడిపోయింది. అదే సమయంలో సురేశ్‌తో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తోంది. అప్పటికే ఓ కుమార్తె ఉన్న సుహాసిని మరో కుమార్తెకు జన్మనిచ్చింది. ఇరువురి మధ్య ఏర్పడిన విభేదాలతో సుహాసిని, కీర్తన, జెర్సీలను హతమార్చాలని సురేశ్ వ్యూహం పన్నాడు. తాడేపల్లిలో ఉంటున్న వీరిని రాజమహేంద్రవరంలో దుస్తులు కొనేందుకు అంటూ తీసుకెల్లి.. గౌతమి బ్రిడ్జి వద్ద సెల్ఫీ తీసుకుందామని చెప్పి భార్య ఇద్దరు పిల్లల్ని గోదావరిలోకి గెంటేసి కారులో పరారయ్యాడు. కీర్తన ఆ సమయంలో కేబుల్ పైపు గొట్టాన్ని పట్టుకొని పోలీసులకు ఫోన్ చేయడంతో.. రక్షించామని ఎస్పీ వెల్లడించారు.