ఆంధ్రప్రదేశ్

andhra pradesh

pawan_kalyan

ETV Bharat / videos

SP Joshua Issued Notices on Pawan Kalyan Comments: సాక్ష్యాలు ఉంటే ఇవ్వండి.. పవన్​కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు - Pawan Kalyan speech

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 2:54 PM IST

SP Joshua Issued Notices on Pawan Kalyan Comments:జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ్టి పెడన వారాహి యాత్రలో రాళ్లదాడికి ప్లాన్ చేశారని మంగళవారం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సాక్ష్యాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీ జాషువా నోటీసులు జారీ చేశారు. పెడన వారాహి యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఆధారాలు లేకుండా పవన్ ఆరోపణలు చేయటం సరికాదని ఎస్పీ జాషువా అన్నారు. 

మంగళవారం మచిలీపట్నంలో జనసేన నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో.. పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడనలో జరగబోయే సభపై పవన్ కల్యాణ్ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. పెడన సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్​ను దింపారనే సమాచారం తమకు ఉందని అన్నారు. పబ్లిక్ మీటింగ్​లో రాళ్ల దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారంటున్నారన్నారు. పెడన సభలో గొడవలు సృష్టిస్తే.. తాము సహించమని పవన్‌ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details