ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వృద్ధురాలు

ETV Bharat / videos

Notices Old Woman: కుమారుడి నిర్వాకంతో.. 70 ఏళ్ల వయస్సులో రోడ్డున పడ్డ మాతృమూర్తి - వృద్ధురాలి ఇంటికి ఫైనాన్స్ కంపెనీ నోటీసులు

By

Published : Jun 24, 2023, 10:35 PM IST

Old Woman: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కుమారుడి నిర్వాకంతో తల్లి రోడ్డున పడింది. కుమారుడు ఇంటిని లోన్​లో పెట్టడంతో తాను రోడ్డున పడ్డానని ఓ వృద్ధ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మైలవరానికి చెందిన భాగ్యలక్ష్మి భర్త మూడేళ్ల క్రితం చనిపోయారు. భాగ్యలక్ష్మికి తెలియకుండా ఆమె ఉంటున్న ఇంటిని కుమారుడు వేణుగోపాలాచారి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో.. ఇంటి పత్రాలు పెట్టి లోన్ తీసుకున్నాడు. అతను లోన్ కట్టకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

కోర్టు ఉత్తర్వులతో ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది మైలవరంలోని ఇంటికి నోటీసులు అంటించి ఇంటికి తాళం వేశారు. ఇదేం పనంటూ స్థానికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఫైనాన్స్ కంపెనీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తామేం చేయలేమంటూ ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఇంటికి నోటీసు అంటించి, తాళం వేసి వెళ్లిపోయారు. ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఇంటికి తాళం వేయడంతో 70 సంవత్సరాల వృద్ధురాలు భాగలక్ష్మి రోడ్డున పడ్డారు. తన భర్త పేరుపై ఉన్న ఇల్లు ఎలా తాకట్టుకు వెళ్లిందో తెలియదని భాగ్యలక్ష్మి అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details