Somireddy Inspected the Sarvepalli Canal: మంత్రి కాకాణి అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది: సోమిరెడ్డి - Minister Kakani Govardhan Reddy news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 10:50 PM IST
Somireddy Inspected the Sarvepalli Canal: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతుందని దుయ్యబట్టారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే రూ.100 కోట్ల దోపిడీ జరిగిందని సోమిరెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి కాకాణి కాళ్లకింద చచ్చిందని మండిపడ్డారు.
TDP Leader Somireddy Fire On Minister Kakani: సర్వేపల్లి నియోజకవర్గంలోని నక్కల కాలువను గురువారం మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు పరిశీలించారు. పరిశీలనలో భాగంగా కాలువ పనులకు సంబంధించి.. సెప్టెంబర్ 5వ తేదీన టెండర్ పిలవాల్సి ఉండగా..ఇప్పుడే పనులను ప్రారంభించారని ఆగ్రహించారు. టెండర్కి ఇంకా 20 రోజులు ఉండగానే 7 మిషన్లతో పనులు ప్రారంభించారని విమర్శించారు. ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్, నీటిపారుల శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్ పిలవకుండానే పనులు ఎలా చేస్తారు..? అని ప్రశ్నించారు. చట్టాలను ఉల్లంఘించి పనులు చేయటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లుబాటు అవుతుందని మండిపడ్డారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.