ఆంధ్రప్రదేశ్

andhra pradesh

illegal_mining

ETV Bharat / videos

సీఎస్​, డీజీపీతో పాటు పలువురిపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు - రాజకీయ వార్తలు నెల్లూరు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 3:53 PM IST

Somireddy Complaint to Police on CS, DGP about Illegal Mining : నెల్లూరు జిల్లాలో కేజీఎఫ్​ సినిమాను మించి అక్రమ మైనింగ్​ జరుగుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, డీఎమ్​జీ, కలెెక్టర్​, ఎస్సీలపై నెల్లూరు రూరల్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. జిల్లాలో అక్రమ మైనింగ్​ యథేచ్చగా సాగుతున్నా కలెెక్టర్​, పోలీసులు పట్టించుకోవటం లేదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుడు పదార్థాలతో తెల్లరాయిని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్​ తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Polices Careless Attitude in Illegal Mining :జిల్లాలోని పొదలకూరు మండలం వరదపురం గ్రామంలో సుమారు డెబ్భై ఎకరాల్లో అక్రమ మైనింగ్​ జరుగుతుందని సాక్ష్యాధారాలతో రాష్ట్ర, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్​లో​ భాగంగా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని, ఏదైనా అనుకొని సంఘటన జరిగితే భారీగా నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. అక్రమ మైనింగ్​ను ఆపాలని, పాత వారికే అనుమతులు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్​ను జిల్లా అధికారులు బేఖాతరు చేశారని ఉద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details